అమ్మ
అమ్మ - తన ప్రాణాలని ఫణంగా పెట్టి జన్మ ఇచ్చింది అమ్మ .అమ్మ - మనమీద భారం లేకుండా తానే మోసేది అమ్మ.
అమ్మ - తాను తినకుండా మనకు పెట్టేది అమ్మ.
అమ్మ - ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంది అమ్మ.
అమ్మ - మనకి ఎం కావాలన్నా చేసి పెట్టేది అమ్మ
అమ్మ- తనకి విశ్రాంతి లేకుండా కంటికి కాపలా గ చూసుకునేది అమ్మ.
అమ్మ - మనకి ఆరోగ్యం బాగోక పోతే రాత్రి పగలు జాగ్రత్త గా చూసుకునేది అమ్మ.
అమ్మ - పుట్టినప్పటి నుంచి మన మలమూత్రాలు కడిగి సేవ చేసేది అమ్మ.
అమ్మ - శ్రమ అనేది లేకుండా ఓపిక గ నీ కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉండేది అమ్మ
ఇలా ఎన్నో . అలాంటి అమ్మ కి ఏమి చేసిన ఎంత చేసిన ఋణం తీర్చుకోలేం.
ఏమి చేయగలం
1. వాళ్ళని వృద్ధాశ్రమం కి పంపకుండా ఉండటం.
2. వాళ్ళని చీదరించు కోకుండా చూడటం.
3. వాళ్ళ ఆరోగ్యం చూసుకోవటం
ఇంతకన్నా ఎం చేయగలం